సంకల్పంతో సాగుదాం: రావణ దహనం చేసిన మోడీ

సంకల్పంతో సాగుదాం: రావణ దహనం చేసిన మోడీ
  • రావణుడిపైకి బాణం వేసిన మోడీ

న్యూఢిల్లీ: మంచి సంకల్పంతో ముందుకు సాగుదామని భారత ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన దసరా వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రావణుడిపైకి బాణం వేశారు. రావణ దహన కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయదశమి సందర్భంగా.. ప్రజలంతా మంచి సంకల్పం తీసుకోవాలని కోరారు.

మహాత్మా గాంధీ 150వ జయంతి, గురు నానక్ 550వ జయంతి లాంటి సందర్భాలు అరుదుగా వస్తుంటాయన్నారు మోడీ. ఇలాంటి సందర్భాల్లో రిజల్యూషన్ తీసుకోవాలని సూచించారు. ఆహారాన్ని వృథా చేయకపోవడం, విద్యుత్ సంరక్షణ, నీటిని పొదుపు చేయడంలాంటివాటిని గురించి సంకల్పబద్ధులై పనిచేయాలన్నారు.

మన దేశంలో పండుగలు.. విలువల్ని, విద్యను నేర్పుతాయని, సామాజిక జీవితాన్ని తీర్చిదిద్దుతాయని మోడీ అన్నారు. పండుగలు మనల్ని ఏకం చేస్తాయన్నారు.  కొత్త ఆశలు, ఆశయాల వైపు నూతనోత్తేజంతో పయనించేలా చేస్తాయని అన్నారు.