
భారత 17వ ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రారంభమయ్యింది. ఇవాళ ( సెప్టెంబర్ 9 ) సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఈ ఎన్నికలో ఎన్డీయే తరఫున సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ తొలి ఓటు వేశారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పార్లమెంట్ హౌస్ వసుధ కాంప్లెక్స్‌లోని రూమ్ నంబర్ ఎఫ్ 101లో పోలింగ్ కేంద్రంలో ఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడిస్తారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు సహాయకులుగా మరో ఇద్దరు అసిస్టెంట్ రిట్నరింగ్ ఆఫీసర్లు ఉంటారు. ఈ క్రమంలో అధికార ఎన్డీయే, ఇండియా కూటమి అభ్యర్థులు గెలుపుపై ధీమాగా ఉన్నారు.
Voted in the 2025 Vice President election. pic.twitter.com/soCoJJmHSI
— Narendra Modi (@narendramodi) September 9, 2025
ALSO READ : రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రయోగం సక్సెస్..
రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో కూడుకున్న ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటు ఉంటుంది. అయినప్పటికీ ఎంపీలు తమ పార్టీ అభ్యర్థికే ప్రాధాన్యం ఇస్తారు. క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశమూ ఉంటుంది. ఇదిలా ఉండగా..టీడీపీ, వైసీపీ పార్టీలు బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేడీ ఎంపీలు ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనడంలేదు.