ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన ప్రధాని మోదీ

ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం మహారాష్ట్ర నాసిక్ లోని ప్రాచీన కాలారామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోకి వెళ్లిన మోదీ.. స్వచ్ఛ్ అభియాన్  కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ఆలయ ప్రాంగణాన్ని  శుభ్రం చేశారు. బకెట్ నీళ్లను  మోసుకెళ్లి తడిబట్టతో ఆలయ ప్రాంగణాన్ని తుడిచారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరిగే  జనవరి 22 వరకు ప్రతిరోజు ఆలయాలన్నింటిని పరిశుభ్రంగా ఉంచాలంటూ మోదీ పిలుపునిచ్చారు. మోదీ ఆలయం శుభ్రం చేసిన వీడియోలు , ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.  

అనంతరం మోదీ పంచవటి పరిసరాల్లో ఉన్న కాలారామ్ మందిరంలో రాములవారి భజనలో పాల్గొన్నారు.  మోదీ ఆలయంలో  కూర్చొని తాళాలు వాయించాడు. ఒక సంగీత వాయిద్యంతో పలువురు పూజారులు రామ్ భజన పాడారు. అనంతరం మోదీ ఇవాళ్టి నుంచి 11 రోజుల పాటు జరిగే అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్టోత్సవాలను ప్రారంభించారు.  ఈ చారిత్రక శుభకరమైన సందర్భం తన హయాంలో జరగడం అదృష్ణంగా భావిస్తున్నట్లు మోదీ చెప్పారు. 

అంతకంటే ముందు నాసిక్ లో మోదీ భారీ రోడ్ షోను నిర్వహించారు. స్థానిక మిర్చీ చౌక్ నుంచి జనార్ధన్ స్వామి మహారాజ్  చౌక్ వరకు సుమారు 40 నిముషాల పాటు రోడ్ షో నిర్వహించారు.  సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోడ్ షోలో పాల్గొన్నారు.