న్యూఢిల్లీ: ప్రజల స్వాతంత్ర్యపు హక్కు ను హరించడం మొదలుకొని పార్లమెంట్, న్యాయవ్యవస్థ, మీడియా, భద్రతా బలగాలు, బ్యాంకులు తదితర వ్యవస్థలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించిం దని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ కుటుంబ పాలన(డైనాస్టీ ) వల్లే దేశానికి దరిద్రం పట్టుకుందని విమర్శించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఒక్కసారి గతాన్ని గుర్తుతెచ్చుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. ‘వ్యవస్థలు– రెండు భిన్నవిధానాలు’ శీర్షికతో బుధవారం మోడీ తన పర్సనల్ బ్లాగ్స్పాట్లో రాసిన వ్యాసంలో ఈ విషయాల్ని ప్రస్తావించారు. మోడీ వ్యాసంపై కాంగ్రెస్ ధీటుగా బదులిచ్చిం ది. జనం అమాయకులు, ఏది చెప్పినా నమ్మేస్తారనే భ్రమ నుంచి మోడీ బయటపడాలని ప్రియాంక గాంధీ అన్నారు .కాంగ్రెస్ అంటేనే ఇంత! కాంగ్రెస్ పార్టీ తన 70 ఏండ్ల పాలనలో ఒక్కో వ్యవస్థని ఎలా నిర్వీర్యం చేసిందో వివరించిన మోడీ, మొట్టమొదటి రాజ్యాం గ సవరణను ప్రస్తావించారు.
‘‘కాంగ్రెస్ మొదటి రాజ్యాం గ సవరణ(1951)లోనే వాక్‌స్వాతంత్ర్యం పై నియంత్రణ విధించింది. తను మాత్రమే కరెక్ట్, మిగతావాళ్లం తా రాంగ్ అన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. ఎక్కడెక్కడ కాంగ్రెస్ వారసత్వ పాలన నడించిందో ఆయా రాష్ట్రాల్లోనూ వ్యవస్థలు దెబ్బతిన్న పరిస్థితి మనం చూశాం. అప్పటిదాకా సరిగా పని చేయని పార్లమెంట్, కాంగ్రెసేతర ప్రభుత్వాల హయాంలో అద్భుతమైన ఫలితాలు సాధించడం గమనించాం . మన్మోహన్ నేతృత్వంలోని యూపీఏ క్యాబినెట్ ఆమోదించిన భూసేకరణ బిల్లు కాగితాల్ని యువరాజు(రాహుల్ గాంధీ) చించి పారేస్తారు. ఇదే మన్మోహన్ ముందుండి నడిపించిన ప్లానింగ్ కమిషన్ను ‘జోకర్ల సమూహం’గా రాజీవ్ గాంధీ అవమానించారు. 70 ఏండ్ల పాలనలో ఆర్టికల్ 356ని కాంగ్రెస్ 100సార్లకు పైగా ప్రయోగించింది. అందులో సగం ఇందిరాగాంధీ హయాంలో పెట్టినవే. మంత్రి కొడుకుల్ని విమర్శించిన పాపానికి సామాన్యులను జైళ్లలో పడేసిన ఘటనలున్నాయి. కోర్టు ధిక్కారాన్ని కాంగ్రెసోళ్లు అదేదో గొప్పపని చేసినట్లు భావిస్తారు. కోర్టులు రాజ్యాంగ పరిధిలో కంటే (నెహ్రూ)కుటుంబ ఆదేశాలకు లోబడి పనిచేయాలన్నది వాళ్ల ఉద్దేశం. ప్రధాన న్యాయమూర్తులపైనా బెదిరింపులకు దిగుతారు. ఆ మధ్య జస్టిస్ దీపక్ మిశ్రా విషయంలో వాళ్ల తీరును మన మంతా చూశాం. తిరస్కరించడం, భయపెట్టడం, బెదిరించడం.. ఇదే కాంగ్రెస్ మోడస్ ఆపరెండీ. నేషనల్ అడ్వైజరీ కమిటీ(ఎన్ఏసీ) పేరుతో పీఎంవోని కంట్రోల్ చేసిన వీళ్లే మళ్లీ వ్యవస్థల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. రక్షణ వ్యవస్థపై గౌరవం ఉండదు, అడుగడుగునా బలగాలను అవమానించేలా మాట్లాడతారు. కాంగ్రెస్ పాలనలోనే రక్షణ శాఖలో అక్రమాలు జరిగాయి. ఆర్మీ జీపుల నుంచి మొదలుపెట్టి తుపాకుల కొనుగోళ్లదాకా అన్నింటా అవినీతికి పాల్పడ్డారు. ప్రతి కుంభ కోణంలోనూ మధ్యవర్తులకు ఆ(నెహ్రూ)కుటుంబంతో లింకులుంటాయి. ఆర్మీ చీఫ్ని ‘గూండా’ అని తిట్టిన రోజులూ ఉన్నాయిమరి. కాంగ్రెస్ కుటుంబంలోని అందరూ అవినీతి కేసుల్లో బెయిల్పై తిరుగుతున్నారు. కనీసం చట్టానికి సమాధానం చెప్పాలన్న బాధ కూడా వాళ్లలో కనిపించదు. లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రజలు ఇవన్నీ గుర్తుచేసుకోవాలి.2014లో డైనెస్టీని ఓడించి హానెస్టీ(నిజాయితీ)ని గెలిపించినట్లే మరోసారి ఆశీర్వదిం చండి”అంటూ మోడీ రాసుకొచ్చారు.
