యూపీ రోడ్డు ప్రమాదం: మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్ గ్రేషియా

యూపీ రోడ్డు ప్రమాదం: మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్ గ్రేషియా

యూపీ రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయాలైన వారికి 50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 

 మరో వైపు యూపీ రోడ్డు ప్రమాదంపై   రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే   దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు.

ఉత్తర  ప్రదేశ్ లోని ఉన్నావ్ లో జూలై 10న ఉదయం  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  లక్నో ఆగ్రా హైవేపై డబుల్ డెక్కర్ బస్సు,  పాల ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా..మరో 30 మందికి గాయాలయ్యాయి. బీహార్‌లోని సీతామర్హి నుంచి  డబుల్ డెక్కర్  బస్సు ఢిల్లీ వెళ్తుండగా  ఉన్నావ్ దగ్గర ఉదయం 5.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.