
LIC రెండు ప్రీమియంప్లాన్లను శుక్రవారం(జూలై 4న)ప్రారంభించింది.నవ జీవన్ శ్రీ - రెగ్యులర్ ప్రీమియం,నవ జీవన్ శ్రీ - సింగిల్ ప్రీమియం ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.ఇవి నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్, లైఫ్ కవరేజ్ కలిగిన వ్యక్తిగత సేవింగ్స్ ప్లాన్లు. బీమామా రక్షణతో పాటు పెట్టుబడికి భద్రత, వడ్డీ రాబడి కోరుకునే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. ఈ ప్లాన్లు 2025 జూలై 4 నుంచి 2026 మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
నవ జీవన్ శ్రీ - రెగ్యులర్ ప్రీమియం (ప్లాన్ నెం.912): ఇది విడతల వారీగా ప్రీమియం చెల్లించే వారికి అనువైన ప్లాన్. కనీస సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలు, గరిష్ఠ పరిమితి లేదు. వయస్సు పరిమితి 30 రోజుల నుంచి 75 ఏళ్ల వరకు. మెచ్యూరిటీ నాటికి కనిష్ట వయసు 18 సంవత్సరాలు కాగా, గరిష్ఠ వయసు 75 ఏళ్లు.
6, 8, 10 లేదా 12 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధులను ఎంచుకోవచ్చు. పాలసీ టర్మ్ కనీసం 10 సంవత్సరాలు. 15, 16, 20 ఏళ్ల వ్యవధిని కూడా ఎంచుకోవచ్చు.10నుంచి-13 ఏళ్ల పాలసీకి 8.50%, 14-నుంచి 17 సంవత్సరాలకు 9%, 18నుంచి-20 ఏళ్ల కాలానికి 9.50% చొప్పున గ్యారెంటీడ్ అడిషన్లు లభిస్తాయి.
డెత్ బెనిఫిట్: ఆప్షన్ 1 కింద - కనీస సమ్ అష్యూర్డ్తోపాటు వార్షిక ప్రీమియానికి 7 రెట్లు, ఆప్షన్ 2 కింద - వార్షిక ప్రీమియానికి 10 రెట్లు + బేసిక్ సమ్ అష్యూర్డ్ చెల్లిస్తారు. రైడర్లు (యాక్సిడెంట్ డెత్ & డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, ప్రీమియం వెయివర్ బెనిఫిట్ రైడర్) జోడించుకునే వెసులుబాటు ఉంది. మెచ్యూరిటీ తర్వాత లేదా రిస్క్ జరిగినప్పుడు చెల్లింపును ఒకేసారి లేదా నెలవారీ/త్రైమాసిక/అర్ధవార్షిక/వార్షిక ప్రాతిపదికన పొందవచ్చు.
నవ జీవన్ శ్రీ - సింగిల్ ప్రీమియం (ప్లాన్ నం.911): ఈ పాలసీ ఒకేసారి ఏకమొత్తం పెట్టుబడి పెట్టదలచుకున్న వారికి అనువుగా ఉంటుంది. 30 రోజుల నుంచి 60 ఏళ్ల వయస్సు వరకూ ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. అయితే ఆప్షన్ 2 కింద మాత్రం గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు మాత్రమే. మెచ్యూరిటీ సమయానికి కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ఠంగా 75 ఏళ్లు (ఆప్షన్ 2లో 60) ఉండాలి. పాలసీ వ్యవధి కనీసం 5 సంవత్సరాలు, గరిష్ఠంగా 20 సంవత్సరాలు. కనీస హామీ మొత్తం (Sum Assured) రూ.1 లక్ష. గరిష్ఠ పరిమితి లేదు.