బాసర ట్రిపుల్‌‌ ఐటీ అడ్మిషన్ల లిస్ట్‌‌ విడుదల

బాసర ట్రిపుల్‌‌ ఐటీ అడ్మిషన్ల లిస్ట్‌‌ విడుదల

బాసర, వెలుగు : ట్రిపుల్‌‌ ఐటీ బాసర, మహబూబ్‌‌నగర్‌‌ క్యాంపస్‌‌లో ఆరేండ్ల బీటెక్‌‌ అడ్మిషన్ల కోసం ఎంపికైన స్టూడెంట్ల తాత్కాలిక లిస్ట్‌‌ను శుక్రవారం వీసీ ఏ.గోవర్ధన్‌‌, ప్రత్యేకాధికారి మురళీదర్శన్‌‌ విడుదల చేశారు. ఈ లిస్ట్‌‌లో పేర్లు ఉన్న స్టూడెంట్లు ఈ నెల 7, 8, 9 తేదీల్లో బాసర ట్రిపుల్‌‌ ఐటీలో జరిగే కౌన్సెలింగ్‌‌కు తమ ఒరిజినల్‌‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. 

సాధారణ కేటగిరీలో 1690, స్పెషల్‌‌ కేటగిరీలో 158 సీట్లకు కౌన్సెలింగ్‌‌ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కన్వీనర్‌‌ డాక్టర్‌‌ చంద్రశేఖర్, కో -కన్వీనర్‌‌ డాక్టర్‌‌ దేవరాజు, బండి హరికృష్ణ,  డాక్టర్ విఠల్‌‌, బావు సింగ్, అడ్మిషన్‌‌ సభ్యులు పాల్గొన్నారు.