కేజ్రీవాల్ కి బర్త్ డే విషెస్ చెప్పిన మోడీ

కేజ్రీవాల్ కి  బర్త్ డే విషెస్ చెప్పిన మోడీ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు."అరవింద్ కేజ్రీవాల్ జీకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను"  అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానికి అరవింద్ కేజ్రీవాల్‌ ధన్యవాదాలు తెలిపారు. కేజ్రీవాల్‌ నేడు (ఆగస్టు 16)న 54వ ఏట అడుగుపెట్టారు. 

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా కేజ్రీవాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "భారతదేశంలో రాజకీయాలను మార్చారు.  దేశానికి మీరు మరింత సేవ చేసేలా భగవంతుడు దీర్ఘాయుష్షుని ప్రసాదించాలని కోరుకుంటున్నా’’ అని మన్ ట్వీట్ చేశారు.

అంతకుముందు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా కేజ్రీవాల్ ఆయనకు నివాళులర్పించారు. "మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు" అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.