
వారణాసి లోక్ సభ అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోడి శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితం వారణాసిలోని కలెక్టర్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, సర్వానంద సోనేవాల్, నితీష్ కుమార్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయెల్, అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే, రామ్‌విలాస్‌పాశ్వాన్, పన్నీర్ సెల్వం, హేమామాలిని, జయప్రద, మనోజ్ తివారి, రవి కిషన్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.