వారసత్వ ఆస్తులనూ వదలరట.. శ్యాం పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ ఫైర్

వారసత్వ ఆస్తులనూ వదలరట.. శ్యాం పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ ఫైర్

రాయ్ పూర్: వారసత్వ పన్నుపై కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. ‘మధ్య తరగతి ప్రజలపై మరిన్ని పన్నులు విధించాలని కొంత కాలం కిందట యువరాజు, రాజ కుటుంబం సలహాదారు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్‌ వారసత్వ పన్ను విధించడం గురించి మాట్లాడుతోంది. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందిన సంపదపై పన్ను విధించాలంటోంది. 

మీరు చెమటోడ్చి కూడబెట్టిన సంపద.. మీ పిల్లలకు దొరకదు. వ్యక్తులు బతికి ఉన్నప్పుడే కాకుండా మరణించిన తర్వాత కూడా వారి సొమ్మును దోచుకోవడం ఒక్కటే కాంగ్రెస్ సూత్రంలా ఉంది’’ అని మోదీ ధ్వజమెత్తారు. 

అంతకు ముందు పిట్రోడా మాట్లాడుతూ..‘‘అమెరికాలో వారసత్వ పన్ను ఉంది. దాని ప్రకారం.. ఒక వ్యక్తి దగ్గర 100 మిలియన్ల డాలర్ల విలువైన సొత్తు ఉందనుకుంటే.. ఆ వ్యక్తి మరణం తర్వాత అందులో సుమారు 45 శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుంది. మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అదొక ఆసక్తికరమైన అంశం. ఇది న్యాయంగానే ఉంది’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెరలేపాయి.