మరో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోడీ

మరో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోడీ

ప్రధాని నరేంద్రమోడీ మరో రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ లో జరిగిన కార్యక్రమంలో ముంబై నుంచి షిర్డీ, ముంబై నుంచి షోలాపూర్‌కు వెళ్లే రైళ్లను మోడీ పచ్చాజెండా ఊపి ప్రారంభించారు. 

ముంబై – సోలాపూర్ మధ్య  తిరిగే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 455 కి.మీ దూరాన్ని 6 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది,  ముంబై సీఎస్టీ నుంచి సాయంత్రం 4:05 నిమిషాలకు బయలుదేరి రాత్రి 10:40 నిమిషాలకు షోలాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తెల్లవారు జామున 6:05 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 12:35 నిమిషాలకు ముంబై సీఎస్టీకి చేరుకుంటుంది.  ముంబై – షిర్డీ  మధ్య  తిరిగే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 343 కి.మీ దూరాన్ని చేరుకోవడానికి 5 గంటల 25 నిమిషాలు పడుతుంది.తెల్లవారు జామున 6:20 నిమిషాలకు బయలుదేరి ఉదయం 11:40 నిమిషాలకు షిర్డీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో షిర్డీ నుంచి సాయంత్రం 5:25 నిమిషాలకు బయలుదేరి రాత్రి 10:50 నిమిషాలకు ముంబై సీఎస్టీకి చేరుకుంటుంది. 

నెల రోజుల వ్యవధిలో ప్రధాని మోడీ  ముంబైలో పర్యటించడం ఇది రెండోసారి. జనవరి 19న, ప్రధానమంత్రి ముంబైలో రూ. 38,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. త్వరలో జరగనున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా ఆయన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.