ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్

ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్

న్యూఢిల్లీ: పాకిస్తాన్ తో ఉద్రిక్తల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ  శాఖల కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ సన్నద్ధత, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని సమీక్షించారు. పాక్ పై ఆపరేషన్​ సిందూర్ కొనసాగింపుకు అధికారుల మధ్య సమన్వయం కీలకమన్నారు. కార్యదర్శులు తమ శాఖల కార్యకలాపాలను సమీక్షించి, అత్యవసర స్పందన, అంతర్గత కమ్యూనికేషన్ ప్రోటోకాల్‌‌‌‌‌‌‌‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

 నిరంతర అప్రమత్తత, సంస్థాగత సమన్వయం, స్పష్టమైన కమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌ను కొనసాగించాలని మోదీ పిలుపునిచ్చారు. సమావేశంలో కేబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సీనియర్ అధికారులు, రక్షణ, హోం వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు, సమాచారం & ప్రసార, విద్యుత్, ఆరోగ్యం, టెలికమ్యూనికేషన్స్ వంటి కీలక మంత్రిత్వ శాఖల నుంచి కార్యదర్శులు పాల్గొన్నారు.