టీఎంసీ పూర్తిగా అవినీతి నేతలతో నిండిపోయిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సీఎం మమత బెంగాల్ ను దోచుకోవడానికి.. టీఎంసీ లీడర్లకు లైసెన్స్ ఇచ్చిందన్నారు. అందుకే బెంగల్ కు కేంద్ర విచారణ సంస్థలను అనుమతించడం లేదన్నారు మోదీ. తేయాకు పరిశ్రమను గాలికొదిలేశారని విమర్శించారు. బీజేపీ తోనే బెంగాల్ అభివృద్ధి సాధ్యమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జల్పాయిపురిలో పర్యటించారు మోదీ. పశ్చిమ బెంగాల్ లో టూరిజం అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు మోదీ.
దేశంలో కొత్త సవాళ్లను అధిగమిస్తూ చేయాల్సింది చాలా ఉందన్నారు ప్రధాని మోదీ. గత పదేళ్లలో దేశంలో జరిగింది ట్రైలర్ మాత్రమే అన్న మోదీ...అభివృద్ధి పరుగులో ప్రస్తుతం రన్ వే పై ఉన్నామని చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికలు కీలకమైనవి అన్న మోదీ..దేశప్రయోజనాల కోసం బిహార్ ప్రజలు అండగా నిలువాలన్నారు. నవాడాలో జరిగిన బహిరంగ సభలో సీఎం నితీష్ కుమార్ తో కలిసి ప్రధాని మోదీ పాల్గొన్నారు.