
మధ్యప్రదేశ్ రెవాలోని 750 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్రాజెక్టును ఇవాళ ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇది ఆసియాలో అతి పెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ .ఈ సౌర విద్యుత్తు ప్రాజెక్టుతో కేవలం సమీప పరిశ్రమలకు విద్యుత్తు అందడమే కాకుండా, ఢిల్లీలోని మెట్రో రైలుకు కూడా విద్యుత్తు సరఫరా జరుగుతుందని తెలిపారు మోడీ. షాజాపూర్, నీముచ్, చాతార్‌పూర్ ప్రాంతాల్లోనూ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్లు చెప్పారు. సౌర విద్యుత్తు నేటి తరం కోసం మాత్రమే కాదని… 21వ శతాబ్ధపు అవసరాలను ఇది తీరుస్తుందన్నారు. సౌర విద్యుత్తు స్వచ్ఛతతో పాటు.. భద్రతతో కూడుకుందన్నారు ప్రధాని మోడీ.