అటల్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

అటల్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌లో రూ. 4000 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన భారీ టన్నెల్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ నిర్మాణానికి శంఖుస్థాపన జరిగింది. మనాలి-లేహ్ హైవేపై 9.02 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ టన్నెల్‌.. సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్‌గా రికార్డు సృష్టించిన ఈ టన్నెల్ ద్వారా మనాలి-లేహ్‌ల మధ్య 46 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. టన్నెల్‌లో ప్రతీ 150 మీటర్లకు ఒక టెలిఫోన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా టన్నెల్‌లో 60 మీటర్ల దూరానికి అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచారు. ప్రతీ 500 మీటర్లకు ఒక అత్యవసర మార్గాన్ని ఏర్పాటుచేశారు. అదేవిధంగా ప్రతీ 250 మీటర్లకు ఒక సీసీ కెమెరాను ఏర్పాటుచేశారు.

For More News..

రాష్ట్రంలో 1,718 కొత్త కరోనా కేసులు

ప్రాపర్టీ సర్వేలో ఇంటికి రూ.50 వసూలు

కేసీఆర్ తర్వాత నేనే: మంత్రి ఎర్రబెల్లి