పాలసముద్రంలో నాసిన్ అకాడమీని ప్రారంభించిన ప్రధాని మోదీ

పాలసముద్రంలో నాసిన్ అకాడమీని ప్రారంభించిన ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ లో నాసిన్ అకాడమీని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జనవరి 16వ తేదీ మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా పాలసముద్రంలో  అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నేషనల్ అకాడమీ ఆప్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ టాక్స్ అండ్ నార్కోటిక్స్ ను మోదీ ప్రారంభించారు. అనంతరం నాసిన్ లో ఏర్పాటు చేసిన స్టేట్ ఆప్ ఆర్ట్ క్యాంపస్ ను సందర్శించారు. నాసిన్ లో ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. ఈ నాసిన్ కేంద్రాన్ని దాదాపు 503 ఎకరాల విస్తీర్ణంలో రూ.541 కోట్లతో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో నిర్మించారు. IRSకు ఎంపికైన వారికి నాసిన్ లో శిక్షణ ఇవ్వనున్నారు.  

అంతకుముందు, ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి లేపాక్షి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానికి అలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయాన్ని సందర్శించిన మోదీ.. వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత అర్చకులు.. ఆలయ విశిష్టతను  ప్రధాని మోదీకి వివరించారు.