IN–SPACe హెడ్ క్వార్టర్స్ ను ప్రారంభించిన మోడీ

IN–SPACe హెడ్ క్వార్టర్స్ ను ప్రారంభించిన మోడీ

అహ్మదాబాద్: రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో నూతనంగా నిర్మించిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN–SPACe) ప్రధాన కార్యాలయాన్ని పీఎం మోడీ ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెషినరీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వాటి పనితీరును సైంటిస్టులను అడిగి తెలుసుకున్నారు. ఇక 2020 లో IN–SPACe సంస్థను అహ్మదాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ సంస్థ పని చేయనుంది. అంతరిక్ష కార్యకలాపాల ప్రమోషన్, ప్రోత్సాహం , నియంత్రణ కోసం ఈ సంస్థ పని చేయనుంది. ఇస్రో సౌకర్యాలను ఉపయోగించుకునేలా  ప్రైవేట్ సంస్థలకు ఈ సంస్థ సేవలందించనుంది. అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాలకైనాIN–SPACeదే అంతిమ నిర్ణయమని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.