డబుల్​ ఇంజన్​ సర్కార్​తోనే డెవలప్​మెంట్​ సాధ్యం

డబుల్​ ఇంజన్​ సర్కార్​తోనే డెవలప్​మెంట్​ సాధ్యం

సూరత్: డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీ ప్రాజెక్ట్​ పూర్తయితే.. ప్రపంచానికే సూరత్, డైమండ్​ ట్రేడింగ్​ హబ్​గా మారుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వరల్డ్​వైడ్​గా ఉన్న డైమండ్​ మర్చంట్స్, కంపెనీలు సూరత్​లో ఆఫీసులు ఓపెన్​ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలిపారు. డ్రీమ్​ సిటీ ప్రాజెక్ట్​ ఫేజ్​–1 పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ గురువారం శంకుస్థాపన చేశారు. దీనికి ముందు భావ్​నగర్​ సిటీ, సూరత్​లోని లింబాయత్​ ఏరియాలో భారీ రోడ్​షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూరత్​లో రూ.3,400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఖజోడ్​ విలేజ్​కు దగ్గర్లో రెండున్నర ఎకరాల్లో డ్రీమ్​ సిటీ ప్రాజెక్టు చేపడుతున్నట్టు తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్​కు టెక్స్​టైల్​ ప్రోడక్ట్స్​ ఎక్స్​పోర్టు చేసేందుకు సూరత్​ – వారణాసి మధ్య స్పెషల్​ ట్రైన్​ నడిపించేందుకు ఇండియన్​ రైల్వేస్​ ప్లాన్​ చేస్తున్నదన్నారు.

20ఏండ్లలో ఎంతో అభివృద్ధి

20ఏండ్లలో సూరత్​ చాలా డెవలప్​ అయ్యిందని మోడీ అన్నారు. ‘‘గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సూరత్​కు ఏయిర్​పోర్టు తీసుకొద్దామనుకున్న. కేంద్రంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్​ను కన్విన్స్​ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాను. అసలు ఏయిర్​పోర్టు ఎందుకు అవసరమో వివరించాల్సి వచ్చింది. మెట్రో ప్రాజెక్ట్​ మ్యాటర్​లో కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి”అని మోడీ గుర్తు చేశారు. ఇప్పుడు డబుల్​ ఇంజన్​ సర్కార్​ ఉండటంతో.. ఎలాంటి అప్రూవల్స్​ అయినా వేగంగా పూర్తవుతున్నాయన్నారు. సూరత్​లో కొత్త గవర్నమెంట్ స్కూల్స్​, సైన్స్ మ్యూజియం, లైబ్రరీలు, ఫైర్​స్టేషన్లు, మెడికల్​ స్టూడెంట్స్​ కోసం హాస్టల్, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, 25 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు, ఫ్లైఓవర్ కోసం శంకుస్థాపన చేశామన్నారు. తర్వాత సాయంత్రం అహ్మదాబాద్​సిటీలోని మోతేరా స్టేడియంలో 36వ జాతీయ క్రీడలను మోడీ ప్రారంభించారు. అదేవిధంగా జీఎండీసీ మైదానంలో గుజరాత్​ గవర్నమెంట్​ నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో మోడీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.