సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని 

సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని 

హైదరాబాద్: రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ఏర్ప్టాటు చేసిన 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. 54 ఫీట్ల ఎత్తున్న భ‌ద్ర‌వేది బేస్‌పై అమ‌ర్చిన సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం ఇచ్చారు. అంతకు ముందు స్వర్ణ మూర్తికి ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమతామూర్తి స్టాచ్యూ కూర్పొని ఉన్న విగ్రహాల్లో ప్రపంచంలోనే రెండో పెద్ద విగ్రహం కావడం విశేషం. శ్రీ రామనగరంలో కొలువుదీరిన ఈ సమతామూర్తి విగ్రహం చుట్టూ 108 దివ్య దేశాలు నిర్మించారు. రామానుజాచార్యుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పా టు పలువురు పాల్గొన్నారు.