పట్టాలెక్కిన ‘నమో భారత్’ .. ర్యాపిడ్ ఎక్స్ రైలు సర్వీసులను ప్రారంభించిన మోదీ

పట్టాలెక్కిన ‘నమో భారత్’ .. ర్యాపిడ్ ఎక్స్ రైలు సర్వీసులను ప్రారంభించిన మోదీ

సాహిబాబాద్ (యూపీ)/బెంగళూరు: దేశంలోనే తొలి రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సాహిబాబాద్ – దుహై డిపో స్టేషన్ల మధ్య ‘నమో భారత్’ (ర్యాపిడ్ ఎక్స్) రైలు సర్వీసులకు శుక్రవారం పచ్చజెండా ఊపారు. తర్వాత నమో భారత్ రైలులో జర్నీ చేశారు. సాహిబాబాద్ నుంచి గుల్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన ప్రధాని.. తర్వాత అక్కడి నుంచి తిరిగి సాహిబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రైలు సిబ్బంది, స్కూలు స్టూడెంట్లతో ముచ్చటించారు.

అంతకుముందు యూపీఐ పేమెంట్ ద్వారా తొలి స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్డును కొనుగోలు చేశారు. స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వీక్షించారు. యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ తదితరులు పాల్గొన్నారు. ఇక సాహిబాబాద్– దుహై మధ్య ర్యాపిడ్ ఎక్స్ రైలు సేవలు శనివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా ప్రతి 15 నిమిషాలకో ట్రైన్ రాకపోకలు సాగించనున్నాయి.

ప్రారంభించేందుకు మళ్లీ నేనే వస్త

ఆర్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైళ్లను త్వరలో యూపీలోని ఇతర నగరాలకు విస్తరిస్తామని, హర్యానా, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ప్రారంభిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. సాహిబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. 82 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఢిల్లీ – ఘజియాబాద్ – మీరట్ ఆర్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఏడాదిన్నరలో పూర్తవుతుందని చెప్పారు. పూర్తయిన ప్రాజెక్టును ప్రారంభించేందుకు తిరిగి తానే వస్తానని ధీమా వ్యక్తం చేశారు. ‘‘నాలుగేండ్ల కిందట నేనే శంకుస్థాపన చేశాను. ఇవ్వాళ నమో భారత్ రైలు సర్వీసులు షురూ అయ్యాయి. నేను గతంలో చెప్పాను.. ఇప్పుడూ చెప్తున్నా.. మేం మొదలుపెట్టిన ప్రాజెక్టులను మేమే పూర్తి చేసి ప్రారంభిస్తాం” అని అన్నారు. ‘‘భారతదేశ తొలి ర్యాపిడ్ రైలు సర్వీసు ప్రారంభించుకోవడం చారిత్రాత్మక క్షణం.

ఈ ఆధునిక రైలు సర్వీసు.. కొత్త ఇండియా, కొత్త సంకల్పాలను నిర్వచిస్తుంది. దేశంలో రైల్వే సర్వీసుల ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ దశాబ్దం చూస్తుంది” అని తెలిపారు. నమో భారత్, వందే భారత్ రైళ్లు, అమృత్ భారత్ కార్యక్రమం కింద రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడాన్ని ప్రస్తావించారు. అమృత్ భారత్, వందే భారత్, నమో భారత్.. ఈ దశాబ్దం చివరికల్లా ఆధునిక రైల్వేకు సింబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుతాయని అన్నారు. 

డ్రైవర్లు, సిబ్బంది మహిళలే

‘‘చిన్న కలలు కనడం, మెల్లగా నడవడం వంటి అలవాట్లు నాకు లేవు. ఈ దశాబ్దం ముగిసే నాటికి భారతీయ రైళ్లు ప్రపంచంలో మరెక్కడా లేనంతగా అభివృద్ధి చెందుతాయని నేటి యువ తరానికి హామీ ఇవ్వాలనుకుంటున్నా” అని మోదీ చెప్పారు. నమో భారత్ రైళ్ల లోని డ్రైవర్లు, సిబ్బంది మహిళలేనని, మహిళా శక్తి బలో పేతానికి ఈ రైళ్లు ప్రతీకలని అన్నారు.

‘‘80 కి.మీ. కారిడార్ ప్రారంభం మాత్రమే. తొలి దశలో త్వరలో ఢిల్లీ, యూపీ, హర్యానా, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కవర్ అవుతాయి. కనెక్టివిటీని పెంచేందుకు, కొత్త ఉపాధి మార్గాలు సృష్టించేందుకు ఇలాంటి వ్యవస్థలనే దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తాం. ‘నమో భారత్ సిస్టమ్’ కింద సరై కాలెఖాన్, ఆనంద్ విహార్, ఘజియాబాద్, మీరట్ బస్, మెట్రో, రైల్వే స్టేషన్లను అనుసంధానిస్తాం. దేశ రాజధాని ప్రాంతంలో మొత్తం 8 ఆర్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎస్ కారిడార్లను గుర్తించాం” అని వివరించారు.

స్పేస్ స్టేషన్ కడ్తం

స్పేస్ సహా ఎన్నో రంగాల్లో ఇండియా వేగంగా పురోగమిస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. గగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా త్వరలోనే ఆస్ట్రొనాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి పంపుతామని చెప్పారు. త్వరలోనే స్పేస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మిస్తామని తెలిపారు. మన సొంత స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రొనాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చంద్రుడిపైకి పంపే రోజు ఎంతో దూరం లేదని అన్నారు.

బెంగళూరు మెట్రో విస్తరణకూ..

బెంగళూరులో మెట్రో పర్పుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పొడిగించిన సర్వీసులను ప్రధాని వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రారంభించారు. బైయప్పనహల్లి నుంచి కృష్ణరాజపుర వరకు, కెంగేరి నుంచి చల్లఘట్ట వరకు మెట్రో సర్వీసులకు పచ్చజెండా ఊపారు. ఈ విస్తరణ వల్ల కనెక్టివిటీ పెరుగుతుందని, లక్షల మంది ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని మోదీ చెప్పారు.

ఈ విస్తరణతో ‘నమ్మ మెట్రో’ 74 కిలోమీటర్ల మేర 66 స్టేషన్లకు వరకు పెరిగింది. డైలీ 7.5 లక్షల మంది ప్రయాణించనున్నారు. 12 ఏండ్ల కిందట బెంగళూరు మెట్రో ప్రారంభమైంది.  దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంగళూరులో ఉంది. ఈ కార్యక్రమంలో కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు.