ఇదొక కొత్త చరిత్ర...ఇక నా జీవితం ధన్యమైంది : మోడీ

ఇదొక  కొత్త చరిత్ర...ఇక నా జీవితం ధన్యమైంది : మోడీ

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. మనం ఒక అద్భుతాన్ని చూశామన్నారు.  అంతరిక్ష చరిత్రలో  కొత్త చరిత్రను లిఖించామన్నారు.  ఇది నవభారత విజయమని కొనియాడారు మోడీ.  ఇది 140 కోట్ల మంది విజయమని.. ఆజాదీకా అమృత ఘడియల్లో  ఇది తొలి విజయం అని అన్నారు. బ్రిక్స్ సదస్సులో ఉన్నా తన  మనసంతా చంద్రయాన్ 3 పైనే ఉందని చెప్పారు మోడీ. ఇక నవశకానికి కొత్త కథలు చెప్పొచ్చన్నారు మోడీ. చంద్రయాన్ 3 సక్సెస్ తో తన  జీవితం ధన్యమయ్యిందన్నారు. గగన్యాన్ లో కూడా ఇక విజయాలు సాధిస్తామని  చెప్పారు.

చంద్రయాన్ 3 చరిత్ర సృష్టించింది. జాబిల్లిపై ఇప్పటి వరకు ఏ దేశం దిగని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపి మీసం మెలేసింది. సాయంత్రం 5.44 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలవ్వగా 6.04 గంటలకు  చంద్రయాన్ 3 చందమామను ముద్దాడింది. అంతరిక్షంలో భారత ప్రతిష్టను చాటిది . చంద్రుడిపై అడుగు పెట్టిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది ఇక ఇవాళ్టి నుంచి 14 రోజుల పాటు చందమామపై రోవర్ పరిశోధనలు  చేయనుంది.