ఒలింపియాడ్ బ్యానర్లపై మోడీ ఫొటోలు అతికించిన బీజేపీ లీడర్స్

ఒలింపియాడ్ బ్యానర్లపై మోడీ ఫొటోలు అతికించిన బీజేపీ లీడర్స్

ఇండియాలో ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ కు ఇండియా తొలిసారి అతిథ్యమిస్తుండటంతో యావత్ దేశం టోర్నీపై ఆసక్తి చూపెడుతోంది. ఇవాళ్టి నుంచి మొదలయ్యే ఈ పోటీలు వచ్చే నెల 10న ముగుస్తాయి. వరల్డ్ చెస్ ఒలింపియాడ్ సందర్భంగా చెన్నైలో పెద్ద ఎత్తున బ్యానర్స్ ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల మోడీ ఫోటో ఉన్న బ్యానర్లకు కొందరు డీఎంకే కార్యకర్తలు బ్లాక్ పెయింట్ వేసినట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడులో రాజకీయంగా ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ కార్యకర్తలు... బ్యానర్లపై మోడీ ఫోటోలను అతికించారు. ఓ వైపు చెస్ ఒలింపియాడ్ నిర్వహణ జరుగుతుండగా పొలిటకల్ చెక్ మేట్ చర్చనీయాంశమైంది. చైనా, రష్యా గైర్హాజరీతో ఈమెగా టోర్నీ కోసం ఇండియా ఆరు టీమ్స్ ను బరిలోకి దించుతోంది.

ప్రతి టీమ్ లో 5 మంది చొప్పున 30 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పోటీలకు దూరంగా ఉన్న లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఓపెన్ సెక్షన్ లో మొత్తం 188 టీమ్స్ ఉండగా, విమెన్స్ లో 162 జట్లు పోటీలో ఉన్నాయి. టోర్నీ చరిత్రలో అన్ని జట్టు పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ టోర్నీలో పోటీపడే ఆరు జట్లలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి చోటు దక్కింది. ఓపెన్ సెక్షన్ లో పాల్గొనే ఇండియా-1 టీమ్ కు రెండో సీడ్ కేటాయించారు. ఇందులో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి. గ్రాండ్ మస్టర్లు పెంటేల హరికృష్ణ ఉన్నారు. విమెన్ సెక్షన్ ఇండియా-1 టీమ్ లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ఉండగా మూడో జట్టులో బొడ్డా ప్రత్యూష, 14 ఏండ్ల సాహితి వర్షిణికి చోటు దక్కింది.