సోనియా గాంధీకి ప్రధాని మోడీ బర్త్ డే విషెస్

సోనియా గాంధీకి ప్రధాని మోడీ బర్త్ డే విషెస్

యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) చైర్‌పర్సన్ సోనియా గాంధీకి ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఆమె దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సాగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు సోనియా గాంధీ జైపూర్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న మధ్యాహ్నం జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె.. హెలికాప్టర్‌లో సవాయ్ మాధోపూర్‌కు వెళ్లారు. అనంతరం రణతంబోర్‌లోని షేర్ బాగ్ హోటల్‌లో బస చేసినట్టు నేతలు తెలిపారు. కాగా నేడు సోనియా గాంధీ తన పుట్టినరోజు వేడుకలను రణతంబోర్‌లో జరుపుకుంటారని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక యంత్రాంగం అక్కడ అన్ని ఏర్పాట్లు చేసింది.