దాదాకు నివాళులర్పించిన ప్రధాని, రాష్ట్రపతి

దాదాకు నివాళులర్పించిన ప్రధాని, రాష్ట్రపతి

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పార్థివదేహానికి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాళులర్పించారు. ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్‌లోని ప్రణబ్‌ అధికారిక నివాసంలో ఆయన చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రణబ్ కుమారులు, కూతురును పరామర్శించారు. అదేవిధంగా.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, త్రివిధ దళాల అధిపతులు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేంద్రమంత్రి హర్షవర్ధన్, సీపీఐ నాయకుడు డీ. రాజా, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, గులాం నబీ అజాద్, అధిర్ రంజన్‌లు ప్రణబ్‌ చిత్రపటానికి అంజలి ఘటించారు. ఉదయం 9గంటలకు ప్రణబ్‌ పార్థీవ దేహాన్ని సైనిక హాస్పిటల్‌ నుంచి 10 రాజాజీ మార్గ్‌లోని ప్రణబ్ అధికారిక నివాసానికి తీసుకువచ్చారు. ప్రణబ్‌కు సైనిక లాంఛనాలతో నేటి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రణబ్ అంతిమయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకానుంది.

For More News..

శ్రీనగర్ సీఆర్‌పీఎఫ్ ఐజీగా తెలంగాణ కేడర్ మహిళా ఐపీఎస్

రాష్ట్రంలో మరో 2,734 కరోనా కేసులు

జలపాతంలో మిస్సైన యువకుడి మృతదేహం లభ్యం