మోదీ కొత్త పాట రిలీజ్.. ట్వీట్​ చేసిన ప్రధాని

మోదీ కొత్త పాట రిలీజ్.. ట్వీట్​ చేసిన ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మరో పాట రాశారు. నవరాత్రుల సందర్భంగా కొత్త గార్బా పాట ‘మాడీ’ని ఆయన ఆదివారం విడుదల చేశారు. దేశ ప్రజలకు నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ‘‘శుభప్రదమైన నవరాత్రులు ప్రారంభమవుతున్న వేళ.. నేను రాసిన గార్బా పాటను విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. దీనికి మ్యూజిక్ అందించిన మీట్ బ్రోస్ టీమ్ కు, పాట పాడిన దివ్యకుమార్ కు ధన్యవాదాలు” అని మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు తన పాట యూట్యూబ్ లింక్ ను జత చేశారు. కాగా, మోదీ ఇంతకుముందు కూడా గార్బా పాట ఒకటి రాశారు. అది ఇటీవలే రిలీజ్ అయింది.