ఆత్మనిర్భర్ భారత్ కోసం సైన్స్​ను వాడుకోవాలి: మోడీ

ఆత్మనిర్భర్ భారత్ కోసం సైన్స్​ను వాడుకోవాలి: మోడీ

నాగ్​పూర్: ఆత్మనిర్భర్​ భారత్​ కోసం సైన్స్​ను వాడుకోవాలని, ఆ దిశగా పరిశోధకులు ముందడుగు వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. రోజువారీ జీవితంలో మార్పు తీసుకొచ్చేలా సైన్స్​ను మార్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ‘‘సైన్స్ అనేది ల్యాబ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే గొప్ప విజయాలు సాధ్యమవుతాయి. దాని ప్రభావం అట్టడుగు స్థాయికి చేరుతుంది. దాని పరిధి జర్నల్​ నుంచి జమీన్​కు మారాలి. రీసెర్చ్​ అనేది నిజ జీవితంలోకి వచ్చినప్పుడే మార్పు కనిపిస్తుంది” అని మోడీ అన్నారు. మంగళవారం మహారాష్ట్రలోని రాష్ట్రసంత్‌‌ తుకాదోజీ మహారాజ్‌‌ నాగ్‌‌పూర్‌‌ వర్సిటీలో ఇండియన్​ సైన్స్‌‌ కాంగ్రెస్‌‌ 108వ సదస్సును ప్రధాని మోడీ వర్చువల్​గా ప్రారంభించారు. కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్​ కొష్యారీ, కేంద్ర మంత్రులు నితిన్​ గడ్కరీ, జితేందర్​సింగ్, మహారాష్ట్ర సీఎం ​షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్​ తదితరులు పాల్గొన్నారు.

కొత్త టెక్నాలజీపై ఫోకస్​ చేయాలి

శాస్త్రీయ ప్రక్రియలపై ఫోకస్​ పెట్టాలని, ముఖ్యంగా క్వాంటమ్​ టెక్నాలజీస్, డేటా సైన్సెస్, వ్యాక్సిన్ల తయారీ, రీసెర్చ్​పై యువతను ప్రోత్సహించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ చెప్పారు. కాగా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వంటి అంశాలకు ప్రాధాన్యమివ్వాల ని, అలాగే సెమీకండక్టర్ల రంగంలో ఇన్నోవేషన్స్​ అవస రం ఉందని, ఈ రంగంలో దేశ భవిష్యత్తు అవసరాలు తీర్చేలా ఆలోచనలు చేయాలని చెప్పారు.