దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తాం

దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తాం

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేస్తామని ప్రధాని మోడీ అన్నారు. వ్యాక్సిన్ అందుబాటు, పంపిణీ తదితర వ్యవహారాలను నేషనల్ ఎక్స్‌‌పర్ట్ గ్రూప్ చూసుకుంటుందని తెలిపారు. ‘దేశానికి నేనో విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నా.. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ చేస్తాం. ఏ ఒక్కరినీ వదలకుండా అందరికీ వ్యాక్సిన్ అందిస్తాం. కీలకమైన ఫ్రంట్ వారియర్స్‌‌ను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియలో తొలుత వారి మీద అధిక దృష్టి కేంద్రీకరిస్తాం. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను నిపుణుల కమిటీ సూచిస్తుంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ, రవాణా విషయంలో దేశం మొత్తం మీద 28 వేల కోల్ట్ చైన్ పాయింట్లు ఉన్నాయి. ఇవి వ్యాక్సిన్‌‌ను నిల్వ ఉంచుతాయి. అలాగే ప్రతి మారుమూల ప్రాంతాలకూ అందిస్తాయి. రాష్ట్రాలు, జిల్లాల్లో స్థానిక అధికారుల సాయంతో వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ క్రమబద్ధమైన, జవాబుదారీ విధానంతో జరిగేలా లోకల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది’ అని మోడీ పేర్కొన్నారు.