MODI: బీజేపీ ఒక్కటే పాన్ ఇండియా పార్టీ: మోడీ

MODI: బీజేపీ ఒక్కటే పాన్ ఇండియా పార్టీ: మోడీ

బీజేపీ పాన్ ఇండియా పార్టీ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.  రెండు లోక్‌సభ స్థానాలతో ప్రారంభమైన బీజేపీ ఇప్పుడు 303 స్థానాలకు చేరుకుందన్నారు.  తూర్పు నుండి పడమర వరకు..  ఉత్తరం నుండి దక్షిణం వరకు  బీజేపీ  పాన్-ఇండియా పార్టీగా అవతరించిందని చెప్పారు. యువత అభివృద్ధి చెందడానికి బీజేపీ అవకాశం ఇస్తుందన్నారు. బీజేపీ ఫ్యామిలీ పార్టీ కాదని.. ప్రజల  పార్టీ అని వెల్లడించారు.

https://twitter.com/ANI/status/1640723469640802312

 ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఆఫీస్ ను మోడీ ప్రారంభించారు. ఈ  భవనాల సముదాయం కాదని.. బీజేపీ సేవకు చిహ్నం అని అన్నారు. ప్రతికార్యకర్తకు ఈ భవనాలు అంకితమని చెప్పారు.   దేశం ముందు అనేక లక్ష్యాలున్నాయని అన్నారు.ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించిన మోడీ..ఆ చీకటి అధ్యాయనాన్ని దేశంఎప్పటికీ మరచిపోదన్నారు. కాంగ్రెస్  ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తుందని విమర్శించారు. 

https://twitter.com/ANI/status/1640714327186604038