
బెంగాల్ గడ్డ బీజేపీకి సైద్ధాంతికంగా ఎంతో స్ఫూర్తిని, శక్తిని ఇచ్చిందని ప్రధాని మోడీ అన్నారు. నదియా జిల్లా, కృష్ణా నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై మోడీ విమర్శలకు దిగారు. రాష్ట్రంలో హింస పెరిగిపోయిందని, యువతకు ఉద్యోగాలు లేవన్నారు. అల్లర్లు, లాఠీ ఝళిపించడాలు సర్వ సాధారణం అయిపోయాయని, ఇదేనా సరైన పాలన అంటే అని దీదీని ప్రశ్నించారు. కేంద్ర బలగాలు, ఈవీఎంలు ఇలా అన్నింటినీ ఆమె తిట్టుకుంటూ పోతున్నారని, ఆఖరుకు తమ పార్టీ పోలింగ్ ఏజెంట్ లనూ ఆమె తిడుతున్నారని చెప్పారు. దీదీ ఇక పై మీరు ప్రజాస్వామ్యంతో ఆటలాడుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.