
- మన పలుకుబడి పెరిగినందుకే ‘ఆపరేషన్ గంగ’ సక్సెస్
- కరోనాను కంట్రోల్ చేసినట్లే.. దీన్నీ విజయవంతంగా పూర్తిచేస్తం: మోడీ
- పుణేలో మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని
పుణే: కరోనాను ఎట్ల విజయవంతంగా కట్టడి చేసినమో.. అట్లనే ఉక్రెయిన్నుంచి ఇండియన్లను కూడా సురక్షితంగా తీసుకొస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పెద్ద పెద్ద దేశాలు కూడా తమ పౌరులను ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా తరలించడంలో ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. అయితే ‘ఆపరేషన్గంగ’ ద్వారా మనం చాలా వేగంగా మనవాళ్లను ఇండియాకు తీసుకువస్తున్నామని ప్రధాని తెలిపారు. ప్రపంచ దేశాలలో ఇండియాకు పెరుగుతున్న పలుకుబడి వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఆదివారం ఆయన పుణేలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు సింబయాసిస్ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనవసరంగా మాట్లాడుతున్రు: అజిత్ పవార్
కొంతమంది ఉన్నత పదవుల్లో ఉండి అనవసర మాటలు మాట్లాడుతున్నారని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్.. రాష్ట్ర గరవర్నర్భగత్సింగ్కోష్యారీని ఉద్దేశించి అన్నారు. పుణే పర్యటలో ప్రధాని మోడీ వెంట గవర్నర్ కోష్యారీ ఉన్న టైమ్‌లోనే ఆయన ఈ కామెంట్లు చేయడం చర్చనీయాంశం అయింది. ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామ్‌దాస్ అంటూ ఇటీవల కోష్యారీ కామెంట్ చేయడాన్ని బీజేపీ సహా మహారాష్ట్రలోని పార్టీలు ఖండించాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం జరిగిన కార్యక్రమంలో అజిత్ పవార్ మాట్లాడుతూ ‘‘ప్రధాని దృష్టికి నేనొక విషయం తీసుకెళ్లాలని అనుకుంటున్న. ఉన్నత స్థానాల్లో ఉండి కొందరు అనవసర మాటలు మాట్లాడుతున్నారు. వాటిని మహారాష్ట్ర ప్రజలు అంగీకరించరు” అని అన్నారు.
టికెట్ కొని మోడీ మెట్రో జర్నీ
పుణే మెట్రో రైలును ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించిన సందర్భంగా స్వయంగా టికెట్ కొని గర్వరే స్టేషన్ నుంచి ఆనంద్ నగర్ స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. రైలులో స్టూడెంట్లతో సరదాగా మాట్లాడారు. రూ.11,400 కోట్లతో 32 కిలోమీటర్ల పుణే మెట్రో రైలు ప్రాజెక్టును 2016లో చేపట్టారు. ప్రస్తుతం 12 కి.మీ. నిర్మాణం పూర్తయి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది.
ఆర్కే లక్ష్మణ్ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
ప్రఖ్యాత కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ జ్ఞాపకార్థం పుణెలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని కూడా మోడీ ప్రారంభించారు. పలు ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్టులను ఆయన స్టార్ట్ చేశారు. ఆర్ట్ గ్యాలరీని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడంలో డెడికేషన్ చూపించిన ఆర్కే లక్ష్మణ్ కోడలు ఉషా లక్ష్మణ్‌ను ప్రధాని అభినందించారు. ఆర్కే లక్ష్మణ్ రూపొందించిన 30 వేలకుపైగా టైమ్‌లెస్ స్కెచ్‌లు ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాయి. ది కామన్ మ్యాన్‌గా పాపులర్ అయిన ఈ స్కెచ్‌లు డిజిటల్, ఫిజికల్ ఫార్మాట్లలో ప్రదర్శనకు ఉంచారు.