
విభిన్న ప్రతిభావంతుడు కామిశెట్టి వెంకట్ పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. వెంకట్ ప్రతిభ యువశక్తికి ఒక పవర్‌హౌస్ అని మోడీ ట్వీట్ చేశారు. వరంగల్ సభలో పాల్గొన్న ప్రధాని ముందు ఆటిజం బాధితుడు వెంకట్ డ్యాన్స్ చేశాడు. నాటు నాటు పాటకు డ్యాన్స్ కూడా చేశాడు. వరంగల్ సభ తర్వాత శనివారం రాత్రి ట్వీట్ చేసిన మోడీ.. ఆటిజం అతనిని అడ్డుకోలేకపోయిందని.. నాటు నాటు పాట పాడడంతో పాటు ఆ పాటకు డ్యాన్స్ కూడా చేశాడని తెలిపారు. కామిశెట్టి వెంకట్ మనోధైర్యానికి సెల్యూట్ అంటూ అభినందించారు మోడీ.