
వారణాసి కాశీ లోని ప్రసిద్ధ విశ్వనాథ్ మందిరం సిబ్బందికి ప్రధాని మోడీ కానుకగా 100 జతల పాదరక్షలను పంపించారు. వీటిని జ్యూట్ తో తయారు చేయించారు. వారణాసి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోడీ..ప్రత్యేక శ్రద్ధ కూడా చూపిస్తుంటారు. ఇటీవల విశ్వనాథుడి ఆలయ సందర్శన సమయంలో కాళ్లకు రక్షణ లేకుండా పనిచేస్తున్న సిబ్బందిని ప్రధాని చూశారు.
దేవాలయం అంటే పవిత్ర స్థలం కావడంతో అక్కడ జంతుచర్మంతో కానీ, రబ్బరుతో కానీ తయారుచేసిన పాదరక్షలు ధరించకూడదు. పూజారులు, భక్తులు, సెక్యూరిటీ సిబ్బంది ఎవరైనా బయట పాదరక్షలు విడిచి వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే, ప్రధాని అక్కడి సిబ్బందికి జనపనారతో తయారుచేసిన 100 జతల పాదరక్షలను ఆలయ సిబ్బందికి పంపించారు. ప్రధాని పంపిన ఈ పాదరక్షలను చూసి సిబ్బంది సంతోషించారని అధికారులు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం..