
గుజరాత్ లోని భరూచ్ లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గుజరాత్ లో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ. 8 వేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు. అహ్మదాబాద్ లో పేద విద్యార్థుల కోసం ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించారు.
ఇక రేపు జంబూసర్ లో బల్క్ డ్రగ్ పార్క్ తో పాటు, డీప్ సీ పైప్ లైన్ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఆనంద్ జిల్లాలోని వల్లభ్ విద్యానగర్ లో జరిగే బహిరంగ ర్యాలీలో మోడీ పాల్గోననున్నారు. సాయంత్రం జామ్ నగర్ లో ఒక వెయ్యి 460 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.