అఫ్గాన్ క్రైసిస్..రష్యా ప్రెసిడెంట్ తో మాట్లాడిన మోడీ

అఫ్గాన్ క్రైసిస్..రష్యా  ప్రెసిడెంట్ తో మాట్లాడిన మోడీ

రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్ లో మాట్లాడారు ప్రధాని నరేంద్రమోడీ. అఫ్గాన్ లో పరిస్థితులపై ఇరువురు చర్చించారు. దాదాపు 45 నిమిషాల పాటు సంభాషణ కొనసాగింది. పుతిన్ తో ఫోన్ లో మాట్లాడిన విషయాన్ని ట్వీట్ చేశారు ప్రధాని మోడీ. అఫ్గానిస్థాన్ లో ఇటీవలి పరిణామాలపై పుతిన్ తో డిటేయిల్డ్ గా చర్చించినట్లు చెప్పారు . కోవిడ్ విషయంలో ఇరు దేశాల మధ్య సహాకారం, ద్వైపాక్షిక ఎజెండాలపై చర్చించినట్లు ట్వీట్ చేశారు. భవిష్యత్తులో కీలక సమస్యలపై చర్చలు కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు.