అంబులెన్స్ కోసం ప్రధాని కాన్వాయ్ నిలిపివేత

అంబులెన్స్ కోసం ప్రధాని కాన్వాయ్ నిలిపివేత

గుజరాత్ : ప్రజా ప్రతినిధుల కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ను నిలిపేయడం సర్వసాధారణం. ప్రధాని మొదలు మంత్రుల వరకు  ఎవరి కాన్వాయ్ రోడ్డుపైకి వచ్చినా జనానికి ట్రాఫిక్ కష్టాలు తప్పవు. అయితే గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ వీఐపీ కల్చర్ను పక్కనపెట్టి చేసిన పనికి పలువురు అభినందిస్తున్నారు. 

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్ కు వెళ్లారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన రోడ్డు మార్గంలో అహ్మదాబాద్ నుంచి గాంధీ నగర్కు బయలుదేరారు. అదే సమయంలో ఆయన కాన్వాయ్ వెనుక ఓ అంబులెన్స్ వస్తున్న విషయాన్ని ప్రధాని మోడీ గ్రహించారు. వెంటనే తన కాన్వాయ్ను రోడ్డు పక్కగా నిలిపివేయించారు. అంబులెన్స్కు దారి ఇచ్చారు. అంబులెన్స్ ముందుకు వెళ్లిన తర్వాత తిరిగి బయలుదేరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.