
ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఈ ఏడాదిలో తొలిసారి ఆయన మన్ కీ బాత్ లో మాట్లాడనున్నారు. దీంతో మోడీ మన్ కీ బాత్ 97వ ఎడిషన్ కు చేరుకున్నది. కాగా, ప్రతి నెల చివరి ఆదివారం రేడియో, టీవీలో మన్ కీ బాత్ ద్వారా వివిధ అంశాలపై ప్రధాని ప్రజలతో మాట్లాడుతున్నారు. కాగా, కరీంనగర్ లోని 170వ పోలింగ్ బూత్ లో మోడీ మన్ కీ బాత్ లైవ్ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ వీక్షించనున్నారు. మన్ కీ బాత్ అనంతరం ఆయన మీడియాతో ప్రసంగిస్తారు.