రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన

రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో  శ్రీమద్ రామచంద్ర మిషన్ కింద 300 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్ట్ లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. వల్సాద్‌లోని ధరంపూర్‌లో శ్రీమద్ రాజ్‌చంద్ర హాస్పిటల్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు సుమారు రూ.200 కోట్లు ఉంటుంది. ఇది 250 పడకల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి. ఇది అత్యాధునిక వైద్య మౌలిక సదుపాయాలతో ప్రత్యేకించి దక్షిణ గుజరాత్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలను అందిస్తుందని తెలిపింది.

శ్రీమద్ రాజ్‌చంద్ర జంతు ఆసుపత్రికి కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. దీన్ని రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. అత్యున్నత స్థాయి సౌకర్యాలు,ప్రత్యేక పశువైద్యులు, సహాయక సిబ్బందితో కూడిన బృందం ఉంటుంది. ఇది జంతువుల సంరక్షణ కోసం సాంప్రదాయ ఔషధాలతో పాటు సంపూర్ణ వైద్యాన్ని అందిస్తుందని PMO తెలిపింది.

శ్రీమద్‌ రాజ్‌చంద్ర సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ ఉమెన్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. దీని ఖర్చు సుమారు దాదాపు రూ. 40 కోట్ల  వరకు ఉంటుంది. వినోదం కోసం సౌకర్యాలు, స్వీయ-అభివృద్ధి సెషన్‌లు, విశ్రాంతి స్థలాల కోసం తరగతి గదులు ఏర్పాటు చేయనున్నారను. ఇది 700 మందికి పైగా గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. వేలాది మందికి జీవనోపాధిని కల్పిస్తుందని పీఎంఓ పేర్కొంది.