
నంద్యాల: అక్టోబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారని ఏపీ బీజేపీ తెలిపింది. జీఎస్టీ సంస్కరణలపై కర్నూలులో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటించనున్నారు. కర్నూలు సిటీలో ప్రధాని మోదీతో కలిసి కూటమి నేతల రోడ్ షో ఉంటుంది.
ALSO READ : తిరుమల శ్రీవారి సేవలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని నరేంద్ర మోదీ ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారు కావడంతో కూటమి సర్కార్ అందుకు తగిన ఏర్పాట్లకు సిద్ధమైంది. ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపం తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది.