ముచ్చింతల్లో ప్రధాని నరేంద్ర మోడీ 

ముచ్చింతల్లో ప్రధాని నరేంద్ర మోడీ 

ప్రధాని నరేంద్రమోడీ ముచ్చింతల్లోని శ్రీరామ నగరానికి చేరుకున్నారు. ఇక్రిశాట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వచ్చిన ఆయనకు చిన్నజీయర్ స్వామి స్వాగతం పలికి ప్రధాని చేతికి స్వర్ణ కంకణం తొడిగారు. అనంతరం తిరునామాలు, పంచెకట్టుతో ప్రధాని మోడీ శ్రీ లక్ష్మీ నారాయణ హోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అక్కడ ఉన్న 108 దివ్య దేశాలను ప్రధాని దర్శించుకున్నారు. పెరుమాళ్ల దర్శనం, విష్వక్సేనుడి యాగంలో పాల్గొన్న అనంతరం 216అడుగుల సమతామూర్తి విగ్రహాన్నిమోడీ జాతికి అంకితం చేశారు.