
మంచిర్యాల, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రులు, ప్రధాన కార్యాలయం పరిధిలోని హాస్పిటల్స్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. 9 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్లు (జనరల్ మెడిసిన్-2, గైనకాలజిస్ట్-2, అనస్తీషియాలజీ-2, జనరల్ సర్జరీ-1, పీడియాట్రిక్స్-2) పోస్టుల భర్తీ కోసం, ఎంబీబీఎస్ తో పాటు సంబంధిత స్పెషాలిటీలో డిగ్రీ/ డిప్లొమా కలిగి ఉండి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నమోదై ఉండాలని తెలిపారు.
అభ్యర్థులు ఈ నెల 19న ఉదయం 10-.30 గంటలకు కలెక్టరేట్లోని జిల్లా ఆస్పత్రుల పర్యవేక్షణ, ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్న వాక్-ఇన్ -ఇంటర్వ్యూకు తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు www.mancherial.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు.