వారణాసిలో మోదీ పర్యటన.. రిలీజ్ కానున్న పీఎం కిసాన్ పైసలు

వారణాసిలో మోదీ పర్యటన.. రిలీజ్  కానున్న పీఎం కిసాన్ పైసలు

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వారణాసిలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సమ్మేళంలో మోదీ పాల్గొంటారు.  ప్రధానిగా మూడోసారి మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారణాసికి తొలి పర్యటన కావడం విశేషం.  ఈ సందర్భంగా పీఎం కిసాన్ 17వ విడత నిధుల్ని మోదీ విడుదల చేయనున్నారు. ఈ స్కీం ద్వారా మొత్తం 9 కోట్ల 26లక్షల మంది రైతుల ఖాతాల్లో 20వేల కోట్ల రూపాయలను జమ కానున్నాయి. 

మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ రైతుల ఖాతాలో మోదీ డబ్బులు జమచేయనున్నారు. ఆ తర్వాత పారా ఎక్స్ టెన్షన్ వర్కర్లుగా పనిచేసేందుకు కృషి సఖిలుగా శిక్షణ పొందిన దాదాపు 30వేల మందికి పైగా స్వయం సహాయక బృందాలకు ప్రధాన మంత్రి సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. తన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రధాని కాశీకి వస్తున్నారని వారణాసి జిల్లా బీజేపీ మీడియా ఇంచార్జి అరవింద్ మిశ్రా తెలిపారు.