మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్గా మోడీ

మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్గా మోడీ

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీ గుర్తింపు పొందారు. యుఎస్‌కు చెందిన 'మార్నింగ్ కన్సల్ట్' సర్వే ప్రకారం 78 శాతం రేటింగ్ తో మోడీ టాప్ ప్లేస్ లో నిలిచారు.  మొత్తం 22 మంది గ్లోబల్ లీడర్లపై ఈ సంస్థ సర్వే చేసింది. గత నెల  జ‌న‌వ‌రి 26 నుంచి 31 వ‌ర‌కు సేక‌రించిన డేటా ఆధారంగా  రేటింగ్స్ ఇచ్చారు.

లిస్టులో మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ రెండో స్థానంలో నిలిచారు. స్విస్ ప్రెసిడెంట్ అలైన్ బెర్సెట్ 62 శాతం రేటింగ్ తో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కు 40 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇటలీకి కొత్తగా ఎన్నికైన తీవ్రవాద నేత జార్జియా మెలోని 6లో నిలువగా భారత సంతతికి చెందిన యూకే ప్రధాని రిషి సునాక్ 30 శాతం తో12వ స్థానంలో నిలిచారు.