
ఢిల్లీ: కరోనా వైరస్ కట్టడి, లాక్ డౌన్ అమలవుతున్న తీరుపై చర్చించేందుకు సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుండగా..సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది నాలుగోసారి. మే-03తో దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ముగియనున్న క్రమంలో మరోసారి లాక్ డౌన్ పొడిగించాలా..లేదా.. అనే అంశంపై కూడా సీఎంలతో ప్రధాని మోడీ చర్చించనున్నారని తెలుస్తోంది.