లతాజీ.. హ్యాపీ బర్త్ డే: మోడీ

లతాజీ.. హ్యాపీ బర్త్ డే: మోడీ

ప్రముఖ సినీ గాయనికి లతా మంగేష్కర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో మాట్లాడిన మోడీ… లతా మంగేష్కర్ తో ఫోన్ లో మాట్లాడిన ఆడియోను విడుదల చేశారు. లతా మంగేష్కర్ ఇంటికి వెళ్లినప్పుడు తనకు గుజరాతీ వంటకాలు వడ్డించిన విషయం మోడీ గుర్తు చేసుకున్నారు.

మన్ కీ బాత్ లో పలు విషయాలపై మాట్లాడిన మోడీ… ఇ-సిగరేట్టను ప్రభుత్వం బ్యాన్ చేయడాన్ని సమర్ధించారు. ఇ-సిగరేట్లు తాగితే ప్రమాదం కాదన్న భ్రమ ప్రజల్లో ఉందని అది నిజం కాదని చెప్పారు. వాటివల్ల యువత ఆరోగ్యం కరాబ్ అవుతందని తెలిపారు. చెడు వ్యసనాల బారిన యువత పడకుండా జాగ్రత్త పడాలన్నారు.