
న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్‌గా తేలిన బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బొల్సొనారో త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ‘నా మిత్రుడు ప్రెసిడెంట్ జైర్ బొల్సొనారో వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని మోడీ ట్వీట్ చేశారు. ఇదే మెసేజ్‌ను బ్రెజిల్ అధికార భాష పోర్చుగీస్‌లో కూడా మోడీ ట్వీట్ చేయడం విశేషం.
My friend President @jairbolsonaro, my prayers and best wishes for your speedy recovery.
— Narendra Modi (@narendramodi) July 8, 2020
తనకు కరోనా సోకినట్లు బొల్సొనారో మంగళవారం ట్వీట్ చేశారు. తాను త్వరగా కోలుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేసిన బొల్సొనారో.. వైరస్ ట్రీట్‌మెంట్‌కు ఉపయోగపడుతున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్‌పై హర్షం వ్యక్తం చేశారు. మన దేశ రిపబ్లిక్ వేడుకలకు హాజరవ్వడానికి జనవరిలో బొల్సొనారో ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. బ్రెజిల్‌లో1.5 బిలియన్ల మందికి కరోనా సోకగా.. వైరస్ బారిన పడి ఆ దేశంలో 65 వేల మంది చనిపోయారు.