పడిపోయిన మోడీ అప్రూవల్ రేట్.. అయినా టాప్‌లోనే

పడిపోయిన మోడీ అప్రూవల్ రేట్.. అయినా టాప్‌లోనే

వాషింగ్టన్ డీసీ: ప్రధాని నరేంద్ర మోడీ అప్రూవల్ రేటింగ్స్ మరింతగా పడిపోయింది. రెండేళ్ల కింద 82 శాతం ఆమోద్యతతో ఉన్న మోడీకి ఇప్పుడు అప్రూవల్ రేట్ 66 శాతానికి పడిపోయింది. ఈ విషయాన్ని యూఎస్‌కు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ తెలిపింది. ఈ కంపెనీ గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకింగ్ చేస్తుంటుంది. అప్రూవల్ రేట్ తగ్గినప్పటికీ యూఎస్, యూకే, రష్యా, కెనడా, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి 13 ప్రముఖ దేశాధినేతల కంటే మోడీ ముందుండటం విశేషం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (53 శాతం), జస్టిన్ ట్రూడో (48 శాతం), బోరిస్ జాన్సన్ (44 శాతం)లు మోడీ వెనకాలే ఉన్నారు. భారత్‌లో నిర్వహించిన సర్వే ఆధారంగా మోడీ అప్రూవల్ రేటింగ్ గురించి చెప్పామని మార్నింగ్ కన్సల్డ్ తెలిపింది. ఇండియాలోని 2,126 మందిపై ఈ సర్వే చేపట్టామని పేర్కొంది. వారిలో 66 శాతం మంది మోడీకి అనుకూలత చూపారని, 28 శాతం మంది ప్రధానిని డిస్‌అప్రూవ్ చేశారని సర్వే ఫలితాలను వెల్లడించింది.