
రక్షాబంధన్..రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తాం..అన్నాచెల్లెళ్లు..అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక ఈ పండగ.. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో జరుపు కుంటాం..ఈ సారీ కూడా ఆగస్టు 19న రక్షాబంధన్.. జరుపుకునేందుకు దేశ ప్రజలను సన్నద్ధం అవుతున్నారు. అయితే రాఖీ పౌర్ణమీ రోజున ప్రముఖులకు చిన్నారులు, విద్యార్థులు రాఖీలు కట్టడం చేస్తుంటారు..అయితే దేశ ప్రధాని నరేంద్ర మోదీకి గత రెండు దశాబ్దాలుగా మన పక్క దేశమైన పాకిస్తాన్ మహిళ రాఖీ కడుతోంది. ప్రధాని మోదీని సోదరునిగా భావించిన ఆమే.. ఖమర్ షేక్.. 1990 నుంచి మోదీకి రాఖీ కడుతున్నారు. ఈ సారి కూడా మోదీకి రాఖీ కట్టేందుకు సిద్దమతున్నారు.
పాకిస్తానీ మహిళ.. ఖమర్ షేక్.. గత 29యేళ్లుగా ప్రధానికి రాఖీ కడుతోంది. షేక్ కరాచీలో జన్మించిన ఖమర్.. పెళ్లి అయిన తర్వాత భారత్ కు వలస వచ్చారు. 1990లో తొలిసారి మోదీని కలిసిన ఆమె అప్పటినుంచి ఇప్పటివరకు రాఖీ కడుతోంది. 30వ సారి ప్రధాని మోదీకి రాఖీ కట్టేందుకు ఢిల్లీకి వచ్చేందుకు సిద్దమైంది.
ఖమర్ షేక్.. 1981లో ఇండియాకు చెందిన మొహ్సిన్ షేక్ ను పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి భారత్ లో స్థిరపడింది. 1990 నుంచి ఖమర్ 35యేళ్లుగా మోదీతో టచ్ లో ఉన్నారు.
ప్రధాని మోదీకి ఖమర్ షేక్ కట్టే రాఖీలో ఓ ప్రత్యేకత ఉంది.. ఖమర్ ఆ రాఖీలను మార్కెట్ లో కొనుగోలు చేయదు.. ఆమె స్వహస్తాలతో తయారు చేస్తుంది.ప్రధాని మోదీ చేతికి కట్టే వరకు ఆమె చేతులు తప్పా మరొకరు వాటిని ముట్టుకోరు. అది ప్రత్యేకత.
ఈ సంవత్సరం వెల్వెట్ తో రాఖీని సిద్దం చేసింది ఖమర్ షేక్.. రాఖీలో ముత్యాలు, మెటల్ ఎంబ్రాయిడరీలు, టిక్కీలను ఉపయోగించి తయారు చేసింది. రక్షా బంధన్ ఒకరోజు ముందు ఢిల్లీకి వెళ్లేందుకు టిక్కెట్లు కూడా బుక్ చేసుకుంది.
గతేడాది మోదీకి రాఖీ కట్టేందుకు భర్తతో కలిసి ఢిల్లీ కి వెళ్లింది ఖమర్ షేక్.. ఈ ఏడాది కూడా రక్షా బంధన్ వేడుకలకు తనకు ఆహ్వానిం అందుతుందని షేక్ భావిస్తోం ది. ఒక సోదరిగా తన సోదరుడి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలిపారు. గత దశాబ్ద కాలంగా తాను చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రధాని మోదీ కొనసాగి స్తారని ఆమె ఆశిస్తున్నారు.