వర్క్ ఫ్రమ్ ఇవ్వండి అని ప్రధాని మోదీ ఓపెన్గా చెప్పేశారు. కరోనా తరహా ఆర్థిక సంక్షోభం ఉందని.. పెట్రోల్, డీజిల్ కొరత కంట్రోల్ చేయటానికి.. దేశ ఆర్థిక వ్యవస్థ కోసం వర్క్ ఫ్రమ్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. మళ్లీ వర్చువల్ మీటింగ్స్.. జూమ్ కాల్స్ చేసుకోవాలని సూచించారు మోదీ.
హైదరాబాద్ సిటీ అంటేనే ఐటీ.. హైదరాబాద్ సిటీ ఐటీ రంగంలో 10 లక్షల మంది ఉన్నారు. హైదరాబాద్ సిటీ కేంద్రంగా పని చేస్తున్న ఈ 10 లక్షల మంది ఉద్యోగులకు.. ఆయా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ఇస్తాయా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రధాని మోదీ బహిరంగంగానే పిలుపునివ్వటం అంటే మాటలు కాదు. అలాంటి ప్రధాని చెబితే.. ఐటీ కంపెనీలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేస్తాయా లేదా అని ఉత్కంఠ రేపుతోంది.
Nation First Duty Above Comfort!
— MyGovIndia (@mygovindia) May 10, 2026
PM @narendramodi gave 7 important appeals to strengthen India during challenging global times prioritize work from home wherever possible, reduce fuel consumption, avoid foreign travel for a year, adopt Swadeshi products, cut down cooking oil… pic.twitter.com/jhDGYTarH6
నిన్నమొన్నటి వరకు వర్క్ ఫ్రమ్ హోం తీసేశాయి కంపెనీలు. కచ్చితంగా ఆఫీసుకు రావాలని కండీషన్ పెట్టాయి. ఇప్పుడిప్పుడే ఉద్యోగులు అందరూ ఆఫీసులకు వస్తున్నారు. ఇలాంటి టైంలో.. మళ్లీ వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని మోదీ పిలుపునివ్వటం ద్వారా.. ఐటీ కంపెనీలు ఎలా నిర్ణయం తీసుకుంటాయనేది ఉత్కంఠ రేపుతోంది.
ఉద్యోగులు అవకాశం ఉన్నంత వరకూ ‘వర్క్ ఫ్రం హోం’కు ప్రియారిటీ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సూచన సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. దేశ ప్రధాని మోడీ అభ్యర్థన మేరకు మే 10 నుంచి ఒక సంవత్సరం వరకూ ‘వర్క్ ఫ్రం హోం’ విధానంలో పనిచేస్తానని కొందరు ఉద్యోగులు తమ మేనేజర్లకు వాట్సాప్లో మెసేజ్లు చేసినట్లు సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ స్క్రీన్ షాట్స్ మీమర్స్ పనే అయినప్పటికీ.. ‘వర్క్ ఫ్రం హోం’ మరోసారి హాట్ టాపిక్ అయింది.
I have done my part. Did you do yours? pic.twitter.com/lVQHa9ewH9
— AIN (@Tejusurya_) May 11, 2026
అసలు వర్క్ ఫ్రం హోం ఎందుకు చేయాలని పిలుపునిచ్చారంటే.. ఈ ఆప్షన్ ఎంచుకుంటే ఉద్యోగులు ఆఫీస్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అందువల్ల.. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గుతుంది. కాలుష్యం తగ్గుతుంది. భారత్లో పెట్రోల్, డీజిల్ కొరత సమస్య దాదాపుగా తలెత్తే అవకాశం ఉండదు. కరోనా సమయంలో బయటకు వెళ్లే పరిస్థితులే లేకపోవడంతో ఐటీ కంపెనీలన్నీ వర్క్ ఫ్రం హోం ఇచ్చేశాయి. ఈ వర్క్ ఫ్రం హోం విధానానికి ఉద్యోగులు కూడా అలవాటు పడ్డారు. ఇప్పటికీ కొన్ని ఐటీ కంపెనీల్లో వర్క్ ఫ్రం హోం విధానమే నడుస్తుంది.
►ALSO READ | తప్పు చేయను, చేయనివ్వను... తప్పుడు ఆలోచనలు ఉంటే తొలగించుకోండి
ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీనే వర్క్ ఫ్రం హోం విధానానికి పిలుపునివ్వడంతో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పిస్తాయా..? లేదా..? అనే చర్చ మరోమారు తెరపైకొచ్చింది. ఇప్పటికే చాలా సాఫ్ట్వేర్ కంపెనీల్లో హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేసే అవకాశం ఇస్తున్నాయి. ఈ విధానంలో ఉద్యోగి వారంలో రెండు లేదా మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది. మిగతా రోజుల్లో ఎలా పని చేయాలన్నది ఉద్యోగి ఇష్టానికి వదిలేస్తారు. ఇప్పుడు ఐటీ కంపెనీల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది.
దీనివల్ల ప్రొడక్టివిటీ పెరగడం, ఎంప్లాయ్స్సంతృప్తిగా ఉండటంతో టీం మేనేజర్లు కూడా ఈ హుష్డ్ హైబ్రిడ్ ట్రెండ్ను ప్రోత్సహిస్తున్నారు. అయితే ఈ కొత్త ట్రెండ్‌పై కొన్ని ఐటీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ట్రెండ్తో ఎంప్లాయ్స్ని భవిష్యత్తులో రెగ్యులర్గా ఆఫీసులకు రప్పించడం కష్టంగా మారుతుందని కలవరపడుతున్నాయి.
ఈ క్రమంలో దేశ ప్రధాని వర్క్ ఫ్రం హోంకు ప్రియారిటీ ఇవ్వాలని పిలుపునివ్వడంతో.. వర్క్ ఫ్రం హోం కోసం కంపెనీలపై ఒత్తిడి తీసుకురావాలని ఐటీ ఉద్యోగులు భావిస్తున్నారు. ఆఫీస్కు తప్పనిసరిగా రావాలని.. వర్క్ ఫ్రం హోంకు పూర్తిగా స్వస్తి పలకాలని.. ఆఫీస్కు రాకపోతే హైక్స్ ఉండవని ఐటీ కంపెనీలు ఉద్యోగులను హెచ్చరిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
