నేపాల్ లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం

నేపాల్ లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం

నేపాల్ లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. లుంబినీలో ప్రధాని మోడీకి నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా స్వాగతం పలికారు. యూపీలోని ఖుషీనగర్ నుంచి ప్రత్యేక విమానంలో నేపాల్ వెళ్లారు ప్రధాని మోడీ. మహామాయాదేవి ఆలయంలో ప్రత్యేక పార్థనలు చేశారు ప్రధాని మోడీ. తర్వాత బౌద్ధ సంస్కృతి, వారసత్వ కేంద్రానికి నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బాతో కలిసి శంకుస్థాపన చేశారు ప్రధాని మోడీ. నేపాల్ ప్రభుత్వం నిర్వహించే బుద్ధ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. లుంబినీ డెవలప్ మెంట్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించే...బుద్ధ జయంతి వేడుకల్లో ప్రసంగిస్తారు మోడీ.



బుద్ధుల ఆధ్యాత్మిక క్షేత్రంలో పర్యటన గౌరవ ప్రదంగా భావిస్తున్నట్లు తెలిపారు స్పష్టం చేశారు ప్రధాని మోడీ. పర్యటనలో బాగంగా ఇరు దేశాల ప్రధానుల భేటీ... పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రకటించారు నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ. 2014 నుంచి ప్రధాని మోడీ నేపాల్ వెళ్లడం ఇది రెండోసారి. నెలక్రితమే నేపాల్ ప్రధాని బహదూర్ దేవ్ బా భారత్ కు మూడ్రోజుల పాటు పర్యటన కోసం వచ్చారు. ప్రధానంగా భారత్, నేపాల్ ద్వైపాక్షిక సమావేశాలకు సంబంధించిన.. ఐదు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్లు తెలిపాయి అధికార వర్గాలు.