యువతా.. దేశ శ్రేయస్సే మనకు ముఖ్యం

యువతా.. దేశ శ్రేయస్సే మనకు ముఖ్యం

కోల్‌‌కతా: యువత నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్లాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశంలో సమస్యలు ఎదురైనప్పుడు వాటిల్లో చిక్కుకోకుండా, పరిష్కరిస్తూ జాతి శ్రేయస్సు కోసం విద్యార్థులు పాటుపడాలన్నారు. కోల్‌‌కతాలోని విశ్వ భారతి యూనివర్సిటీ యానువల్ కాన్వకేషన్ కార్యక్రమంలో మోడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. ఇందులోని సెంట్రల్ వర్సిటీకి ఛాన్స్‌‌లర్‌‌గా ఉన్న మోడీ విద్యార్థులకు ఆత్మనిర్భర్ భారత్ ఆవశ్యకత గురించి వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా కొత్త విద్యా విధానం కీలక ముందడుగన్నారు. స్టూడెంట్స్ పాజిటివ్ మైండ్‌సెట్‌‌తో ఉండాలని సూచించారు. సమస్యల్లో భాగమవ్వాలా లేదా వాటిని పరిష్కరించాలా అనేది మనలోనే ఉందని, నిత్యం సానుకూల దృక్పథంతో ఉంటే అద్భుత ఫలితాలను సాధించొచ్చన్నారు.